అనుష్క పెళ్లిపై మరో వార్త..నిజమెంత?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరున్న అనుష్క శెట్టి పెళ్లిపై రొజుకొక వార్త వినపడుతుంది. కొన్ని రోజుల క్రితం అనుష్క ఓ ప్రముఖ క్రికెటర్‌ను పెళ్లి చేసుకోనుందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై అనుష్క కాస్త గట్టిగానే స్పందించింది. తన తల్లిదండ్రులు చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తెలియజేసింది. దాంతో ఆమె పెళ్లిపై వచ్చిన వార్తలు సైలెంట్ అయ్యాయి. తాజాగా మరోసారి అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఈ వార్తల ప్రకారం అనుష్క.. సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తనయుడు.. డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందట. ఇది వరకే ప్రకాశ్ కోవెలమూడికి పెళ్లైంది..కొన్ని నెలలు క్రితం వీరిద్దరూ విడాలకు తీసుకుని విడిపోయారు. ఇప్పుడు ప్రకాశ్ కోవెలమూడితో అనుష్క పెళ్లి జరగనుందని న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి దీనిపై అనుష్క ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం నిశ్శబ్దం. ఏప్రిల్ 2 విడుదల కానున్న ఈ థ్రిల్లర్‌పై మంచి అంచనాలున్నాయి. రెండేళ్ల తర్వాత అనుష్క నటిస్తోన్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout