నటి పూర్ణ కేసు విచారణలో మరో కొత్త విషయం వెలుగులోకి..

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

నటి పూర్ణ(షామ్నా ఖాసిం) కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పూర్ణను బెదిరించిన ముఠాతో మలయాళ నటుడు ధర్మజన్‌ బోల్‌గట్టికి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని ముఠాతో ఉన్న సంబంధాలపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణలో మరో కొత్త విషయం తెలిసింది.

పూర్ణను వేధించిన ముఠా సభ్యులు మరో 8 మంది మోడల్స్‌ను కిడ్నాప్‌ చేసి డబ్బులు గుంజేందుకు యత్నించారని తెలిసిందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఆ ముఠాకు సంబంధించిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీలో హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. అతడిని విచారించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా.. లాక్‌డౌన్ కారణంగా తన కుటుంబంతో కలిసి కేరళలో ఉంటున్న పూర్ణను సోషల్ మీడియా వేదికగా ఓ గ్యాంగ్ వేధింపులకు గురి చేసింది. మొదటగా వివాహ ప్రతిపాదన ద్వారా పూర్ణ కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పరుచుకున్న ముఠా.. అనంతరం డబ్బు గుంజేందుకు ప్లాన్ చేసింది. ఆమెకు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడింది. రూ.50 లక్షలు డిమాండ్ చేసింది. క్రమక్రమంగా పూర్ణకు ముఠా నుంచి వేధింపులు పెరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

More News

హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షల కోసం సంప్రదించాల్సిన కేంద్రాలివే..

హైదరాబాద్‌లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

వారికి గుడ్‌న్యూస్.. రూ.10 వేలున్న జీతాన్ని 28 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

ప్రపంచంలో వాళ్లకో ప్రత్యేక స్థానముంది. పలు సందరభాల్లో వారు చూపిన చొరవకు ప్రపంచమే ఫిదా అయిపోయింది.

ఉదయ్ కిరణ్ చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’ ఇన్నాళ్లకు ఓటీటీలో విడుదల

స్టార్ హీరో ఉదయ్ కిరణ్ చివరి సినిమా ఇన్నాళ్లకు విడుదలకు నోచుకుంది. ఉదయ్ మరణం ఎంతో మంది అభిమానులను కలచివేసింది. ‘చిత్రం’

డిస్నీ చేతికి రామోజీ ఫిలింసిటి?

కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు.. పెద్ద పెద్ద సామ్రాజ్యాలను కూడా కూల్చేసిందనేది కొందరి వాదన. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండతో పాటు రామోజీ ఫిలింసిటీ కూడా గుర్తొస్తుంది.

హైదరాబాద్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ లేనట్టేనా?

హైదరాబాద్‌లో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతుండటంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించాలని భావించింది.