YSRCP: ఏపీ ఎన్నికలపై మరో జాతీయ సంస్థ సర్వే.. వైసీపీ ప్రభంజనం ఖాయం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. పోలింగ్‌కు నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటుందనే విషయాలపై అనేక మీడియా, సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఇందులో చాలా సంస్థలు వైసీపీ విజయం ఖాయమని చెబుతున్నాయి. తాజాగా వెల్లడైన మరో సర్వేలో వైసీపీ ప్రభంజనం కొనసాగనుందని తేలింది.
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ-ఈటీజీ రీసెర్చ్(TIMES NOW - ETG Research Survey)సర్వే తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీనే అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 19-20 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక టీడీపీకి 3-4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బీజేపీ ఒక స్థానం రావొచ్చని అంచనా వేసింది. అయితే జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా దక్కదని పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే టీడీపీ కూటమికి 5 స్థానాలకు మించి రావని.. ఏపీలో వైసీపీ హవా మరోసారి కొనసాగనుందని స్పష్టంచేసింది.
ఎంపీ ఫలితాలను బట్టి చూస్తే అసెంబ్లీలో 130కి పైగా సీట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని అర్థమవుతోంది. దీంతో వైసీపీ అధినేత జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడమే ఆలస్యమని ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే పలు సర్వే ఫలితాలు ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఏ సర్వే చూసినా వైపీపీ గెలుపు పక్కా అని స్పష్టంచేస్తున్నాయి. కాగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతలుగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణలో నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు విడతల ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com