బ్లాక్ బస్టర్ దళపతి టైటిల్ తో మరో సినిమా

  • IndiaGlitz, [Sunday,August 06 2017]

సూపర్ స్టార్ రజనీకాంత్ , మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం '' దళపతి ''. 1991 లో వచ్చిన ఈ దళపతి దక్షిణాదిన సంచలన విజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది . మణిరత్నం దర్శకత్వం వహించిన దళపతి దక్షిణాదిని ఓ ఊపు ఊపేసింది . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత అదే బ్లాక్ బస్టర్ '' దళపతి ''టైటిల్ తో తెలుగులో సినిమా రూపొందుతోంది . సదా , బాబు హీరోలుగా చేస్తున్న ప్రయత్నమే ఈ దళపతి .
ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం '' దళపతి ''. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో సదా - కవితా అగర్వాల్ , బాబు - ప్రియాంక శర్మ రెండు జంటలుగా నటిస్తున్నారు . యాజమాన్య సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని బాబురావు పెదపూడి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నాడు .
ఈ సందర్బంగా దర్శకులు సదా మాట్లాడుతూ " విభిన్న కథాంశం తో యాక్షన్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న దళపతి చిత్ర షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందని ...... అలాగే మా సినిమా కు ఛాయాగ్రాహకులు జై అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవనుంది , జై అందించిన సహకారం వల్లే మా సినిమా అద్భుతంగా వచ్చిందని , జై అందించిన విజువల్స్ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం ఖాయమని అన్నారు.
నిర్మాత బాబురావు మాట్లాడుతూ '' దర్శకులు సదా చెప్పిన కథ నచ్చడంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టానని , కథ చెప్పినట్లుగానే సినిమా బాగా తీసాడని ....... షూటింగ్ పూర్తి కావడంతో రష్ చూసుకున్నాం చాలాబాగా వచ్చింది . యాజమాన్య అందించిన పాటలు ప్రేక్షకులను అలరించడం ఖాయం . రజనీకాంత్ దళపతి లా మా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని , మా మొదటి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసాడు .

More News

'లై' సినిమా 14 రీల్స్ బ్యానర్ గౌరవాన్ని పెంచే చిత్రమవుతుంది - త్రివిక్రమ్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.

మేడమీద అబ్బాయి టీజర్ విడుదల!

వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.

బన్నివాసు నిర్మిస్తున్న వి4మూవీస్ 'నెక్ట్స్ నువ్వే' విడుదల

ఆదిసాయికుమార్ హీరోగా,ప్రభాకర్.పి దర్శకుడిగా పరిచయం చేస్తూ వి4మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత బన్ని వాసు

సప్తగిరి హీరోగా 'సప్తగిరి సూపర్ ఫాస్ట్' ప్రారంభం

'సప్తగిరి ఎక్స్ ప్రెస్ ' చిత్రంతో సప్తగిరి హీరోగా తన లో మరో కోణాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

సాంగ్స్ రికార్డింగ్ లో 'లోకరక్షకుడు'

చంద్రాస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై చండ్ర పర్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చండ్ర నిర్మిస్తున్న'లోకరక్షకుడు'