YCP:వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా.. జనసేనలో చేరేందుకు సిద్ధం..
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుసపెట్టి నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. కాపులకు జరుగుతున్న వివక్షను చూసి విసిగిపోయి పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఒక కార్పోరేటర్ స్థానం కూడా తమ సామాజికవర్గానికి ఇప్పించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలను భరిస్తూ వైసీపీ కోసం అంకిత భావంతో పనిచేశానని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తానని ఇవ్వలేదని.. చివరకు రాజ్యసభ సీటు ఇస్తానని కూడా మాట తప్పారని మండిపడ్డారు. ఆఖరికి ఏపీఐసీసీ చైర్మన్ పదవి ఆశ చూపి నిరాశకు గురిచేశారని ఫైర్ అయ్యారు. తన సొంత నిర్మాణ సంస్థ జేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ ద్వారా వివిధ ప్రాంతాల్లో చేసిన పనులకు బిల్లులు రూ.73 కోట్లు ఆపేశారని వాపోయారు. వారికి అనుకూలమైన వారికి మాత్రమే బిల్లులు మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. రాయలసీమలో బలిజలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజల సమస్యలు పరిష్కరించలేని దుస్థితి తీసుకొచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవి కుటుంబంతో తనకు 2002 నుండి అవినాభావ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పవన్ కల్యాణ్‌ని కలవగానే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. బలిజలు అంటే జగన్‌కు విపరీతమైన ద్వేషం అని ఆరోపించారు. గురువారం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి చేరుతున్నట్లు తెలిపారు. కాగా రాయలసీమలో బలిజ వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే శ్రీనివాసులు కావడం గమనార్హం.
చిత్తూరు ఇంఛార్జ్‌గా విజయానందరెడ్డిని నియమించండతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పినా అది కూడా దక్కలేదు. దీంతో ఆయన ఆగ్రహంతో ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఆ వెంటనే పార్టీ నుంచి శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. తాజాగా ఆయన జనసేనలో చేరనుండటంతో తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments