Government School Children:ప్రభుత్వ బడి పిల్లలకు.. అమెరికా నుంచి మరోసారి ఆహ్వానం..
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో విద్యా రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. నాడు-నేడు, మనబడి, విద్యాకానుక వంటి పథకాలతో విద్యార్థులను పాఠశాల బాట పట్టిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యాభ్యాసం రూపురేఖలను మారుస్తున్నారు. ఈ క్రమంలో మనబడి పిల్లలు అంతర్జాతీయ మేదావుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించి ఎందరో మేధావులను ఆకట్టుకున్న మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దేశవిదేశాల విద్యావేత్తలనుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు వారికే మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం లభించింది. 2024 మార్చి 5న అమెరికాలో జరగనున్న నానో టెక్నాలజీ సదస్సుకు రావాల్సిందిగా విద్యార్థులకి ఆహ్వానం అందింది.
ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ..
ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యోమగాములతో పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సలహాదారు, భారత సంతతికి చెందిన ఆర్తి ప్రభాకర్‌తో కలిసి వేదికను పంచుకుని వారితో మాట్లాడే అవకాశం మన విద్యార్థులకు దక్కింది. ఆప్టిక్స్, విద్య, వైద్యం, ఉత్పత్తి, తయారీ రంగం,మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి అంశాల మీద విద్యార్థులు అక్కడ ప్రసంగిస్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మొదలైన సంస్కరణలు, అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు, ప్రశంసలు దక్కడం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్లో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని ఆయాదేశాల ప్రతినిధులతో కలిసి ప్రసగించారు. అక్కడి పాలనావిధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలమీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాలమీద చర్చలు.. విద్యావేత్తలు, ఆర్థిక, సామాజికవేత్తలతో భేటీలు నిర్వహించారు.
ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ..
పదిమంది విద్యార్థులు పదిహేను రోజులపాటు కొలంబియా , స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాలమీద అవగాహన పెంపొందించుకున్నారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను, దానికోసం సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు గురించి వివరించారు.
రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి, నాడు- నేడు, విద్యాకానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందీ పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు. అంతేకాకుండా మన ప్రభుత్వం విద్యకోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల మెప్పు పొందారు. తాజాగా ఇప్పుడు మరో సదస్సుకు పిలుపు రావడం అంటే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలకు మరో గుర్తింపు వచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments