హైదరాబాద్‌లో మరో పరువు హత్య
Send us your feedback to audioarticles@vaarta.com
మిర్యాలగూడ పరువు హత్య మరువక ముందే.. హైదరాబాద్‌లో మరో పరువు హత్య జరిగింది. చందానగర్‌కు చెందిన హేమంత్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో యువజంట నివాసముంటోంది. ప్రేమించి పెళ్లి చేసున్న యువ జంటపై యువతి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం హేమంత్ ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు హేమంత్‌ను కిడ్నాప్ చేశారు. అతని భార్య మాత్రం తప్పించుకుంది.
ఈ విషయాన్ని హేమంత్ తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో.. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా హేమంత్‌ను కిరాయి హంతకులు సంగారెడ్డికి ఎత్తుకెళ్లి అక్కడే అతి కిరాతంగా హత్య చేశారు. కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివాయలోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని పడేసి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిపోయారు.
హేమంత్ హత్యపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు.. నిన్న అర్ధరాత్రి కిష్టాయగూడెం వచ్చి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసు వాహనాలను చూసి పెట్రోలింగ్ సిబ్బంది సైతం అక్కడికి వెళ్లింది. కిష్టాయగూడెం శివారులో ఆధారాలు సేకరణకు సంగారెడ్డి క్లూస్ టీమ్ వెళ్లింది. కాగా.. నిందితులు గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments