మరో హిస్టారికల్ చిత్రంలో...
Send us your feedback to audioarticles@vaarta.com
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న జగపతిబాబు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది అజయ్ దేవగణ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. ఈయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నసినిమా హిస్టారికల్ సినిమా.
వివరాల్లోకెళ్తే.. ఛత్రపతి శివాజీ ముఖ్య అనుచర వర్గానికి చెందిన తానాజీ పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఓం రావత్ ఈ చిత్రానికి దర్శకుడు. తానాజీ అనే టైటిల్‌తోనే సినిమా తెరకెక్కనుంది.
వయాకామ్18తో పాటు అజయ్‌దేవగణ్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. ఇందులో జగ్గూభాయ్ ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. ఆయన లుక్‌కి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఈ ఏడాది సైరా నరసింహారెడ్డితోపాటు జగపతిబాబు నటిస్తున్న మరో హిస్టారికల్ మూవీ తానాజీ కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments