బ‌న్నీతో మ‌రో హీరోయిన్‌ ?

  • IndiaGlitz, [Tuesday,April 21 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా న‌టిస్తుంద‌ని.. ఆమె ఎవ‌రో కాదు మ‌ల‌యాళ బ్యూటీ నివేదా థామ‌స్ అని స‌మాచారం. బ‌న్నీ ల‌వ‌ర్ పాత్ర‌లో నివేదా థామ‌స్ క‌నిపిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

పాన్ ఇండియా చిత్రంగా చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంలో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో బన్నీ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, ర‌గ్డ్ లుక్‌తో కనపడ్డారు. ఫ‌స్ట్ లుక్ చూసిన వారంద‌రూ బన్నీ లుక్‌ కొత్తగా ఉందని అన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వ‌ర‌కు చాలా వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. క‌రోనా వైరస్ కారణంగా ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమా మా షూటింగ్ మొదలవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ‌తున్నాయి.

More News

కేసీఆర్‌కు వ‌ర్మ విస్కీ ఛాలెంజ్‌

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కొన‌సాగుతోన్న స‌మ‌యంలో సినిమా సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. అంద‌రూ వారికి న‌చ్చిన ప‌నులు చేయ‌డ‌మే కాకుండా..

ఎన్టీఆర్ ఛాలెంజ్‌ను బాల‌య్య స్వీక‌రిస్తాడా?

ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు ఆగిపోయాయి. కొంత మంది మ‌ధ్య కొన్ని ఛాలెంజ్‌లు న‌డిచిన‌ప్ప‌టికీ, లేటెస్ట్‌గా ‘బీ ద రియ‌ల్‌మేన్‌’ ఛాలెంజ్ ట్రెండ్ న‌డుస్తోంది

నేను స‌మంత‌ను కాను: నిహారిక‌

మెగా బ్ర‌ద‌ర్ త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ త‌ర్వాత ఆయ‌న త‌న‌య నిహారిక కొణిదెల ఒక మ‌న‌సు సినిమాతో బుల్లితెర నుండి వెండితెర‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఛాలెంజ్‌లో పాల్గొన్న చర‌ణ్ ఏమ‌న్నాడంటే..?

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క‌రోనా దెబ్బ‌కు దేశ‌మంత‌టా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ

చీపురు ప‌ట్టిన తార‌క్‌.. ఎవ‌రికి ఛాలెంజ్ విసిరాడంటే..?

లాక్‌డౌన్ వేళ సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇళ్ల‌ల్లోకి ప‌ని మ‌నుషుల‌ను కూడా సెల‌బ్రిటీలు రానీయ‌డం లేదు స‌రిక‌దా! ఎవ‌రింటి ప‌నిని వారే చేసుకుంటున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది.