ప్రభాస్ సినిమాలో మరో హీరోయిన్.. ఎగిరి గంతేస్తున్న యంగ్ బ్యూటీ
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నేషనల్ రేంజ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సాహో బాలీవుడ్, టాలీవుడ్లో మంచి కలెక్షన్స్‌ను సాధించింది. కానీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. దీంతో ప్రస్తుతం చేస్తోన్న సినిమాపై ప్రభాస్ చాలా కాన్సన్ట్రేషన్ చేసి నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించేలా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్గా నటిస్తుంది.
లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుందట. ఆమె ఎవరో కాదు.. రిద్దికుమార్. ఇది వరకు రాజ్‌తరుణ్‌తో లవర్ సినిమాలో జత కట్టిన రిద్దికుమార్కు, ఆ సినిమా డిజాసర్ట్ కావడంతో నిరాశే ఎదురైంది. ఇలాంటి తరుణంలో ఏకంగా ప్రభాస్ నటించే అవకాశం దక్కడంతో ఈ యంగ్ బ్యూటీతో ఆనందంతో ఎగిరి గంతేస్తుందట. గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌ను ఆస్ట్రియాలో జరుపుకోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments