ఊపిరిలో మరో హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నాగార్జున పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తవుతుంది. అయితే ఈ చిత్రంలో అందాల తార అనుష్క అతిధి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అనుష్కతో పాటు మరో హీరోయిన్ శ్రియ కూడా అతిథి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. గతంలో నాగ్ తో కలసి శ్రియ సంతోషం, నేనున్నాను, మనం చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఊపిరి లో శ్రియ కూడా నటిస్తుందని ప్రచారం జరగుతుండడంతో ఊపిరి సినిమా పై మరింత క్రేజ్ పెరుగుతుంది. ఇంతకీ ఊపిరి ఎలా ఉంటుందనేది తెలియాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com