మ‌హేశ్ ‘స‌ర్కారు వారి పాట‌’లో మ‌రో హీరోయిన్‌..?

  • IndiaGlitz, [Friday,June 26 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా 'స‌ర్కారు వారి పాట' అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను విడుద‌ల చేసి సినిమాల‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ప‌లు ర‌కాలైన పేర్లు విన‌పడ్డాయి. అయితే చివరకు జాతీయ అవార్డు గ్రహీత కీర్తిసురేశ్‌ను ఫైన‌ల్ చేశారు. ఈ విష‌యాన్ని కీర్తిసురేశ్ క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా న‌టించే అవ‌కాశం ఉంద‌ట‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా నివేదా థామ‌స్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

‘స‌ర్కారు వారి పాట‌’ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ప‌వ‌ర్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంద‌ని ఇటీవ‌ల‌ మ‌హేశ్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకుల‌ను మోసం చేసిన విల‌న్ నుండి తిరిగి డ‌బ్బులు రాబ‌ట్టే క‌థే ఈ సినిమా అని వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. పి.ఎస్‌.వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు.

More News

ప‌వ‌న్ 27లో పాట‌లు ఎన్నంటే?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు.

ర‌వితేజ రిస్క్ తీసుకుంటాడా?

మాస్ మహారాజా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రవితేజ ఒక పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్‌4 వ్యాఖ్యాత‌గా సమంత‌..?

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న‌ ఈ రియాలిటీ షో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది.

డిజిట‌ల్ రంగంపై క‌న్నేసిన అగ్ర నిర్మాణ సంస్థ‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో యువీ క్రియేష‌న్స్ ఒక‌టి. వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్‌లు ఈ బ్యాన‌ర్‌పై సినిమాల‌ను రూపొందించే సంగ‌తి తెలిసిందే.

ఓ స్టార్ హీరోతో ‘షాడో’ను రూపొందించనున్నాం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

మధుబాబు రచించిన తెలుగు నవల ‘షాడో’ ఇప్పుడు దృశ్యరూపంగావించబడుతోంది. అతి పెద్ద నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్స్