అఖిల్ సినిమాలో మరో హీరోయిన్...

  • IndiaGlitz, [Wednesday,September 13 2017]

ఇప్పుడు అక్కినేని అఖిల్ న‌టిస్తున్న ద్వితీయ చిత్రం 'హ‌లో'. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌ర‌గుతోంది. సినిమాను డిసెంబ‌ర్ 22న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత అక్కినేని నాగార్జున స‌న్నాహాలు చేస్తున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇందులో అఖిల్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణి కాకుండా మ‌రో హీరోయిన్ కూడా ఇందులో న‌టిస్తుంద‌ని స‌మాచారం. జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌గిల‌ర్ మ‌ట్టుమ్ సినిమాలో న‌టించిన నివేదిత స‌తీష్ ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.