పవన్ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఖరారైందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోశియునుమ్' సినిమాకు ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్‌తో నటించబోయే మరో హీరో ఎవరనే దానిపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రానా దగ్గుబాటి, నితిన్ సహా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ విషయంలోనూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఓ హీరోయిన్‌గా.. పవన్ జోడీ సాయిపల్లవి నటిస్తుందని అంటున్నారు. కాగా, మరో హీరోయిన్ పాత్రలో ఐశర్యా రాజేష్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అంటే పవన్‌తో కలిసి నటించబోయే మరో హీరోకు జోడీ అనే టాక్ అయితే చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు 'బిల్లా రంగా' అనే టైటిల్ పరిశీలనలో ఉందని కూడా అంటున్నారు. పొల్లాచ్చిల్లో సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ జరిగిపోయింది. వచ్చేఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments