రాజమౌళి మల్టీస్టారర్ మూవీలో మరో హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సీరీస్‌తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు రాజమౌళి. ప్రస్తుతం ఆయన విరామం తీసుకుంటున్నారు. అలాగే, అక్టోబర్ నుంచి తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అన్నదమ్ములుగా నటించనున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ అదేమిటంటే.. ఈ చిత్రంలో మరో హీరో కూడా నటించే అవకాశముందట. అయితే.. ఆ హీరో విలన్ పాత్రలో కనిపించనున్నాడట. బాహుబలితో రానా ఎలాగైతే ప్రతినాయకుడిగా అవతారమెత్తి మెప్పించారో.. ఆ తరహాలోనే సదరు కథానాయకుడు విలన్‌గా అవతారమెత్తనున్నారట.. అయితే.. ఆ హీరో ఎవరు? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. మొత్తానికి.. సినిమా ప్రారంభం కాకముందే రాజమౌళి మల్టీస్టారర్ వార్తల్లో నిలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments