పవర్‌స్టార్‌ సినిమాలో మరో హీరో ఈగ విలనేనా..?

  • IndiaGlitz, [Saturday,October 31 2020]

ఈగ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ తర్వాత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారారు. రీసెంట్ టైమ్‌లో చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీ హీరో సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకూ ఆ హీరో ఎవరో కాదు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. ప్రస్తుతం వకీల్‌సాబ్‌ చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్న పవన్‌కల్యాణ్‌ తర్వాత మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియనుమ్‌' రీమేక్‌లో నటించబోతున్నారని, దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో మరో హీరో నటించాల్సి ఉంది. మరి ఆ హీరో ఎవరా? అనే దానిపై క్లారిటీ రాలేదు. ముందుగా రానా దగ్గుబాటి పేరు వినిపించింది. తర్వాత పవన్‌ ఫ్యాన్‌ అయిన హీరో నితిన్‌ పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు ఈ లిస్టులో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ చేరాడు. ఇటీవల సుదీప్‌ హైదరాబాద్‌కు వచ్చి సుదీప్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో రెండో హీరోగా నటించడానికే పవన్‌ను సుదీప్‌ వచ్చి కలిశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టక తప్పదు. ఈ చిత్రంలో పవన్‌ సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

More News

చరణ్‌ రికార్డ్‌..!

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పేరిట ఓ రికార్డ్ సొంతమైందని మెగాభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

పవన్‌కల్యాణ్‌ అడుగు పెట్టేది రేపే!!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’.

గాంధీ, నెహ్రులను విమర్శించిన కంగనా రనౌత్‌

శనివారం ఐరన్‌మ్యాన్‌ సర్దార్ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి.

నగల దొంగను పట్టిచ్చిన వాట్సాప్...

దొంగతనం జరిగిన 15 నెలల తరువాత దొంగ అనూహ్యంగా పట్టుబట్టాడు. ఈ దొంగతనం కేసును పోలీసులు ఛేదించలేదు.

హాట్ టాపిక్‌గా రోజా, బండ్ల గణేష్ ఫోటో..

ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, నిర్మాత బండ్ల గణేష్.. ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిశారు. ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు.