ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో..!
Send us your feedback to audioarticles@vaarta.com
అరవింద సమేత తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయాలనేది దర్శక నిర్మాతల ఆలోచన.
తాజా సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో మెయిన్ హీరోతో పాటు మరో హీరోను కూడా తీసుకుంటూ ఉంటాడు. అజ్ఞాతవాసిలో ఆది పినిశెట్టిని విలన్‌గా నటింపచేశాడు. అరవింద సమేతలో నవీన్ చంద్రను సెకండ్ విలన్‌గా చూపించాడు. రీసెంట్గా ఈ ఏడాది విడుదలైన అల వైకుంఠపురములో చిత్రంలో సుశాంత్‌ను కీలక పాత్రలో నటింప చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అదే బాటలో ఇప్పుడు మరో హీరోను ఎన్టీఆర్ 30లో నటింప చేస్తున్నాడు. ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. ఇది పూర్తి కాగానే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com