బన్ని, ఎన్టీఆర్ బాటలో మరో హీరో...

  • IndiaGlitz, [Friday,June 03 2016]

ఒకప్పుడు తెలుగులో బిజీ హీరోగా కొనసాగిన సిద్ధార్థ్. తెలుగులో సినిమాలు ఆశించిన రేంజ్ సక్సెస్ సాధించకపోవడంతో తమిళ సినిమా వైపు దృష్టిని సారించాడురీసెంట్ కళావతి, చిక్కడు దొరకడు వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తప్ప స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయడం మానేశాడు. అయితే తెలుగు, తమిళం, హిందీలో ఓ సినిమా చేయబోతున్నాడట.

ఈ చిత్రాన్ని జూన్ 10న అధికారకంగా తెలియజేస్తాడట. తమిళంలో ఓ కామిక్ సినిమాలో నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సిద్ధార్థ్, ఈ ఏడాది మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మాధ్యమంలో తెలియజేశాడు. ఈ చిత్రాన్ని రితీష్ అంబట్ డైరెక్ట్ చేయబోతున్నాడట. బన్ని, ఎన్టీఆర్ బాటనే సిద్ధార్థ్ ఎంచుకున్నాడు.