సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు..!

  • IndiaGlitz, [Sunday,December 18 2016]

సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు, మంజుల‌, సుధీర్ బాబు...ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మ‌రో వార‌సుడు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఎవ‌ర‌నుకుంటున్నారా...! సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లుడు, తెలుగుదేశం పార్టీ ఎం.పి గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు అశోక్. గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు అశోక్ త్వ‌ర‌లో హీరోగా ప‌రిచ‌యం కానున్నాడు. ఈ విష‌యాన్ని గ‌ల్లా జ‌య‌దేవ్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేస్తూ కుమారుడు గ‌ల్లా అశోక్ ఫోటోల‌ను పోస్ట్ చేసారు.
కృష్ణ పెద్ద కుమార్తె ప‌ద్మావ‌తి, జ‌య‌దేవ్ ల కుమారుడే అశోక్. జ‌య‌దేవ్ త‌న బిజినెస్ ను కుమారుడు అశోక్ చేసుకుంటాడు అనుకున్నార‌ట‌. కానీ..అశోక్ సినిమాల ప‌ట్ల ఆస‌క్తి చూపించాడ‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో రాణించ‌డం అంత సులువు కాదు అని చెప్పినా ఖ‌చ్చితంగా హీరో అవ్వాల‌నుకుంటున్నాను అని అశోక్ చెప్ప‌డంతో కొడుకు కోరిక కాద‌న‌లేక జ‌య‌దేవ్ ఓకే అన్నారట‌. అశోక్ చైల్ ఆర్టిస్ట్ గా మ‌హేష్ బాబు న‌టించిన నాని చిత్రంలో న‌టించాడు. ప్ర‌స్తుతం అశోక్ ఏక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మ‌రి...అశోక్ ఫ‌స్ట్ మూవీ ఎవ‌రితో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

పరభాషా నటీనటులకు మనం స్వాగతం చెబుతాం.. వాళ్లు మాత్రం మనకి అవకాశాలు ఇవ్వరు.. కారణంఅదే..! రావు రమేష్

విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని అనతికాలంలోనే సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు రావు రమేష్.

శ‌త‌మానం భ‌వ‌తి ఆడియో ఫంక్ష‌న్ కి ముఖ్య అతిధి మెగాస్టార్..!

ఉత్తమ కుటుంబకథా చిత్రాల నిర్మాతగా పేరున్న ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం శ‌త‌మానం భ‌వ‌తి. ఈ చిత్రంలో శ‌ర్వానంద్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించారు.

ఈనెల 24న 'ఓం నమో వేంకటేశాయ' టీజర్

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే.

సంపూ 'వైరస్ ' షూటింగ్ పూర్తి....

హృదయలేయం,సింగం 123 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంపూర్ణేష్ బాబు హీరోగా పుల్లారేవు రామచందర్ రెడ్డి సమర్పణలో

చరణ్ మూవీలో చైతు హీరోయిన్..!

ధృవ చిత్రంతో సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో