ఆది మ‌రో హీరోయిన్ ఫిక్స్‌

  • IndiaGlitz, [Sunday,September 16 2018]

రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్న బాబు తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు..యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా న‌టిస్తున్న ఈచిత్రానికి బుర్ర‌కథ అనేది టైటిల్‌. దీపాలా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఇప్ప‌టికే మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి హీరోయిన్‌గా ఓకే అయ్యింది. తాజా స‌మాచార ప్ర‌కారం ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యింది. ఎవ‌రో కాదు..ఇంతకు ముందు తెలుగులో ఇఈ సినిమాలో న‌టించిన నైరా షా.

థియేట‌ర్ ఆర్టిస్ట్ అయిన నైరా షా కిక్ బాక్స‌ర్ కూడా. కొత్త హీరోయిన్స్ అయితే బావుంటుంద‌నే ఆలోచ‌న‌తోనే ద‌ర్శ‌కుడు డైమండ్ ర‌త్న‌బాబు నైరా షాను సినిమాకు సెల‌క్ట్ చేసుకున్నార‌ట‌.