ప్రణయ్ హత్య తర్వాత పట్టపగలే నడిరోడ్డుపై ఘోరం
Send us your feedback to audioarticles@vaarta.com
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ను అతి కిరాతకంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. ఒక్క మాటలో చెప్పాలంటే లవ్ మ్యారేజీ అంటే అప్పట్లో జనాలు ఒకింత జంకారు కూడా. ఆ హత్యతో సుమారు ఏడాదికి పైగా జైలుపాలైన ప్రణయ్ భార్య అమృత తండ్రి, బాబాయ్‌తో పాటు మరో నలుగురు కొద్ది రోజుల క్రితమే విడుదలైన విషయం విదితమే. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం తాజాగా సంగారెడ్డి జిల్లాలో పట్టపగలే మరో దారుణం జరిగింది.
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చేరు పోలీస్ స్టేషన్‌లోని రుద్రారం జాతీయ రహదారిపై పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య నరికి చంపారు. ఈ ఘటన పఠాన్‌చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోవడం గమనార్హం. జాతీయ రహదారిపై ముషీరాబాద్‌కు చెందిన మెహబూబ్ బాషా అనే వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా బైక్‌లపై వచ్చిన కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. కాగా.. సంగారెడ్డి నుండి కోర్టు కేసుకు హాజరై తిరిగివస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం యథావిథిగా బైక్‌లో వెళ్లిపోయారు. అయితే రోడ్డుకు అటువైపు.. ఇటువైపు పెద్ద ఎత్తున వాహనాలు నిల్చున్నాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ హత్యను అడ్డుకోవడానికి ప్రయత్నించకపోగా.. సినిమా చూసినట్లు చూడసాగారు.
స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ, డీఎస్పీ సంఘటనా స్థలానికి పరిశీలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్భంగా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుడు ముషీరాబాదుకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. మృతుడు గతంలో హర్షద్ ఉసేన్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్నారు. అక్రమ రేషన్ బియ్యం మాఫియాలో ప్రధాన సూత్ర దారడని ఈ నేపథ్యంలో హత్య జరిగిందని.. అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తున్నమని ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com