'మన్మథుడు 2' డైరెక్టర్ కు మరో గోల్డెన్ ఛాన్స్?
Send us your feedback to audioarticles@vaarta.com
నటన నుంచి దర్శకత్వం వైపు మళ్లాడు రాహల్ రవీంద్రన్. 'చిలసౌ' చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం హిట్ అయింది. దీనితో ఏకంగా కింగ్ నాగ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. కానీ ఆ మంచి అవకాశం వృధా అయింది. నాగ్ క్లాసిక్ మూవీ మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించిన మన్మథుడు 2 రాహుల్ ని విమర్శలపాలు చేసింది.
ఇదీ చదవండి: 'బుట్టబొమ్మ' సాంగ్ కి డాన్స్ కుమ్మేసిన బాలీవుడ్ హీరో.. రీమేక్ లో అతడే..
ఆ చిత్రం భారీ పరాజయంగా నిలిచింది. నాగ్, రకుల్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఆ చిత్రం విషయంలో పొరపాటు చేశానని స్వయంగా రాహుల్ అనేక సందర్భాల్లో ఒప్పుకున్నాడు. మళ్ళీ తనని తాను నిరూపించుకోవడానికి రాహుల్ రవీంద్రన్ కి మరో అవకాశం కావాలి.
తాజాగా అతడిని ఓ గోల్డెన్ ఆఫర్ వరించినట్లు ప్రచారం జరుగుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కించే అవకాశం అతడికి దక్కిందట. గతంలోనే రాహుల్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాతగా ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రం తెరకెక్కించాల్సింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం సమంతని కూడా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
ఈసారి రాహుల్ రవీంద్రన్ గీతా ఆర్ట్స్ సంస్థని ఓ ప్రేమకథతో ఇంప్రెస్ చేశాడట. దీనితో ఈ ప్రాజెక్ట్ ఓకె అయినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments