‘లూసిఫర్’ రేసులో మరో డైరెక్టర్..?
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని ఏ ముహూర్తాన రీమేక్ చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నారో ఏమో కానీ.. ఈ సినిమా డైరెక్టర్ ఓ పట్టాన ఫిక్స్ కావడం లేదు. తెలుగు నెటివిటీ, చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘లూసిఫర్’ రీమేక్‌లో తగు మార్పులు చేర్పులు చేయడానికి ముందు సుజిత్‌ను డైరెక్టర్‌గా అనుకున్నారు. అయితే సుజిత్ చేసిన చేంజస్ చిరంజీవికి నచ్చలేదు. దీంతో సుజిత్ స్థానంలో వి.వి.వినాయక్ వచ్చాడు. ఈయన కూడా తన టీమ్‌తో లూసిఫర్ మీద తెగ వర్క్ చేశాడు. ఈ మార్పులు కూడా చిరంజీవికి నచ్చలేదట. దీంతో వినాయక్‌ను కూడా పక్కన పెట్టేశారని రీసెంట్‌గా సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
రీసెంట్‌గా ‘లూసిఫర్’ రీమేక్ కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్‌ని చిరంజీవి అండ్ టీం సంప్రదించిందట. అయితే హరీశ్ చిరు ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా.. ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్ కోసం తమిళ దర్శకుడు మోహన్‌రాజా వర్క్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో సెటిలైన తెలుగు టెక్నీషియన్ ఎడిటర్ మోహన్ తనయుడు, కోలీవుడ్ హీరో జయం రవి సోదరుడు అయిన మోహన్‌రాజా తమిళంలో డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. ఈయన చాలా రోజులుగా తెలుగులో ఓ సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన ‘తనీ ఒరువన్’ చిత్రాన్నే తెలుగులో రామ్‌చరణ్ ‘ధృవ’ పేరుతో చేసి హిట్ కొట్టాడు. అప్పటి నుండి మోహన్ రాజా..చరణ్‌తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో లూసిఫర్ ‘లూసిఫర్’రీమేక్ కోసం మోహన్‌రాజాను అప్రోచ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ‘లూసిఫర్’ రీమేక్ డైరెక్టర్స్ పేరులో మోహన్‌రాజా అయినా ఫిక్స్ అవుతాడా? లేక మరో డైరెక్టర్ వచ్చి చేరుతాడా! అని తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout