ఏపీ ఎస్ఈసీ మరో కీలక నిర్ణయం..
Send us your feedback to audioarticles@vaarta.com
పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ మధ్య జరుగుతున్న పోరులో అంతిమ విజయం మాత్రం ఎస్ఈసీకే దక్కింది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన అధికార యంత్రాంగం మాత్రం ఎస్ఈసీకి సహకరించే పరిస్థితి లేదు. ముందు నుంచే ఈ ఎన్నికలకు తాము సహకరించబోమని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర కెబినెట్ కార్యదర్శికి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఆర్టికల్ 324 ప్రకారం జిల్లా కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణ అప్పజెప్పామని పేర్కొన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నామన్నారు. కానీ కొంత మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనమని చెబుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల సేవలకు అనుమతివ్వాలని కోరారు. చివరి ప్రయత్నంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలో స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments