బుట్ట‌బొమ్మ‌కు మ‌రో క్రెడిట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది. అలాగే ఈ సినిమాకు త‌మ‌న్ అందించిన సంగీతం మ‌రో లెవ‌ల్‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా మూడు పాట‌లు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌..., రాములో రాముల‌..., బుట్ట‌బొమ్మ లిరిక‌ల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక సినిమా విడుద‌లైన విడుద‌లైన వీడియో సాంగ్స్‌కు లిరిక‌ల్ వీడియోల‌ను మించిన రెస్పాన్స్ వ‌చ్చింది. ఒక్కొక్క వీడియోకు 100 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చింది. ఈ మూడు సాంగ్స్‌లో సామ‌జ వ‌రగ‌మ‌న‌, రాములో రామ‌ల సినిమా రిలీజ్‌కు ముందు ప్రేక్ష‌కుల్లో క్రేజ్‌ను సంపాదించుకుంటే వీడియో సాంగ్స్‌లో బుట్ట‌బొమ్మ సాంగ్ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ ఉంది.

ముఖ్యంగా బ‌న్నీ స్టెప్పుల‌ను చూసిన సెల‌బ్రిటీలంద‌రూ డాన్సులు చేస్తూ ఆ వీడియోల‌ను టిక్‌టాక్‌లో పోస్ట్ చే్స్తున్నారు. శిల్పాశెట్టి, దిశా ప‌టాని రీసెంట్‌గా బ‌న్నీ డాన్సుల‌ను అప్రిషియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజ‌గా బుట్ట‌బొమ్మ రేంజ్ ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కు చేర‌కుంది. ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఈ పాట‌కు డ్యాన్స్ చేసి ఆ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. త‌న పాట‌కు డాన్స్ చేసినందుకు వార్న‌ర్‌కు బ‌న్నీ థాంక్స్ చెప్పాడు.

More News

గుడ్‌బై మై ఫ్రెండ్.. రిషి కపూర్ మృతిపై చిరు ట్వీట్

బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెంది 24 గంటలు గడవక మునుపే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది.

మరో విషాదం.. దిగ్గజ నటుడు రిషి కపూర్ కన్నుమూత

బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెంది 24 గంటలు గడవక మునుపే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది.

మగవారికే ‘కరోనా’ ఎక్కువగా సోకడం వెనుక..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ థాటికి ప్రపంచ దేశాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాతపడ్డారు.

‘ఆచార్య’ నుంచి కాజల్ కూడా ఔట్.. ఇందుకేనా!

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది కానీ.. ఇప్పటికే సుమారు 70 శాతం

కరోనాకు వ్యాక్సిన్ రెడీ.. ఫస్ట్ ఇండియన్స్‌కే ఛాన్స్!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కరోనా వైరస్‌కు ఇంతవరకూ మందు లేదు. అసలు మందు ఎప్పుడు తయారవుతుందో కూడా తెలియట్లేదు.