ఆసుపత్రి పాలైన మరో మాజీ సీఎం..

  • IndiaGlitz, [Saturday,September 05 2020]

అసోం మాజీ సీఎంలు వరుసగా ఆసుపత్రి పాలవుతున్నారు. మాజీ సీఎం తరుణ్ గోగోయ్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన ఇటీవల ఆసుపత్రి పాలయ్యారు. తాజాగా మరో అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంతా(68) శుక్రవారం సాయంత్రం అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. నిపుణులైన వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.

33 ఏళ్ల వయసులోనే మహంతా అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. అసోం గణపరిషత్ (ఏజీపీ) హయాంలో రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆల్ అసోం స్టూడెంట్స్ అసోసియేషన్‌ను వ్యవస్థాపకుడు కూడా మహంతాయే కావడం గమనార్హం. 1980కి పూర్వం యాంటీ-ఇమిగ్రెంట్స్ ఆందోళనలో మహంతి కీలక పాత్ర పోషించారు.

More News

నెపోటిజం బాలీవుడ్‌లో చాలా ఎక్కువ: సమీరారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘జై చిరంజీవ’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ చిత్రాల ద్వారా తెలుగు చిత్రసీమలో తనకంటూ మంచి నటిగా ముద్ర వేయించుకున్న హీరోయిన్ సమీరారెడ్డి.

మాధ‌వి ల‌త 'లేడీ' టీజ‌ర్ విడుద‌ల‌

టాలెంటెడ్ బ్యూటీ మాధవి లత హీరోయిన్ గా ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో లేడీ అనే సినిమా సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

ఒకేసారి నా ప్రయాణాన్ని గుర్తు చేశారు: పవన్

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన సినీ, మీడియా మిత్రులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

‘సాకి వరల్డ్’ పేరుతో సమంత కొత్త బిజినెస్..

నటీనటులు ఒక స్టార్ డమ్ వచ్చాక.. వాళ్ల దృష్టినంతా వ్యాపారంపై పెడుతుండటం కామన్.

తెలంగాణలో కొత్తగా 2511 కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నేడు రాష్ట్రంలో 2500కి పైగా కేసులు నమోదయ్యాయి.