MLAs Poaching Case : రామచంద్ర భారతిపై మరో కేసు.. కర్ణాటక అడ్రస్‌తో నకిలీ పాస్‌పోర్ట్, ఆ ఫోన్లో కీలక విషయాలు
Send us your feedback to audioarticles@vaarta.com
మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పలువురికి నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని విచారిస్తోంది. మరోవైపు సిట్ అధికారులు రామచంద్ర భారతిని లక్ష్యంగా చేసుకుని విచరణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అతనితో సంబంధాలు వున్న వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు సిట్ అధికారులు. గడిచిన రెండేళ్లలో రామచంద్రభారతి ఎక్కడెక్కడికి వెళ్లారు..? ఎవరిని కలిశారు..? ఎవరితో మాట్లాడారు..? ఇలా అన్ని వివరాలను రాబట్టే పనిలో పడ్డారు. ఘటన జరిగిన రోజున రామచంద్రభారతి ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ ఫోన్ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో పలువురు రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు, వారితో రామచంద్ర భారతి దిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
రామచంద్ర భారతిపై ఏసీపీ గంగాధర్ ఫిర్యాదు:
మరోవైపు రామచంద్రభారతిపై బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదైంది. ఫాంహౌస్ విచారిస్తోన్న సిట్‌లోని సభ్యుడైన ఏసీపీ గంగాధర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా రామచంద్ర భారతిపై కేసు నమోదు చేశారు అధికారులు. దర్యాప్తులో భాగంగా అతని వద్ద దొరికిన ఫోన్, లాప్టాప్లో నకిలీ పాస్‌పోర్టు వున్నట్లుగా గుర్తించినట్లు గంగాధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భరత్ కుమార్ శర్మ పేరుతో పాస్‌పోర్ట్ వుందని.. అందులోని అడ్రస్ కర్ణాటకలోని పుత్తూరు పేరుతో వుందని గంగాధర్ తెలిపారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో ఇప్పటికే కేసు:
ఇప్పటికే రామచంద్రభారతిపై తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫేక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్‌లను తయారు చేయించుకుని పెట్టుకున్నట్లు రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout