‘కార్తికేయ 2’ షూటింగ్‌కి మరోసారి బ్రేక్
Send us your feedback to audioarticles@vaarta.com
‘కార్తికేయ 2’ షూటింగ్‌కి మరోసారి బ్రేక్ పడింది. నిఖిల్, అనుపమా పరమేశ్వర్వన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఘన విజయం సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
మంచు ఎక్కువగా కురుస్తున్న కారణంగా ‘కార్తికేయ 2’ షూటింగ్‌కి బ్రేక్ పడింది. తాజా షెడ్యూల్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని సిస్సులో చిత్ర యూనిట్ ప్రారంభించింది. అయితే అక్కడ మంచు ఎక్కువగా కురుస్తున్న కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘‘హిమాచల్‌ప్రదేశ్‌లోని సిస్సులో ‘కార్తికేయ 2’ చిత్ర యూనిట్ మొత్తం చిక్కుకుపోయింది. గుజరాత్లో 20 రోజుల షెడ్యూల్ అనంతరం మా టీం మొత్తం హిమాచల్‌ప్రదేశ్‌కి షిఫ్ట్ అయింది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల షూటింగ్‌ను ప్రస్తుతానికి ఆపేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
కాగా.. ‘కార్తికేయ 2’ షూటింగ్‌కి బ్రేక్ పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల హీరో నిఖిల్ షూటింగ్లో గాయపడ్డాడు. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా.. ఈ యాక్సిడెంట్ జరిగింది. గుజరాత్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హీరో నిఖిల్‌కి స్వల్ప గాయాలు అవడంతో.. వెంటనే షూటింగ్ నిలిపివేశారు. అయితే నిఖిల్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. ఆ క్రమంలోనే కొన్ని రోజుల పాటు ఈ సన్నివేశాల చిత్రీకరణ నిలిపివేశారు. అనంతరం గుజరాత్ షెడ్యూల్‌ని ముగించుకుని హిమాచల్‌ప్రదేశ్‌లో షూటింగ్ ఆరంభించారు. తాజాగా ఇక్కడ కూడా షూటింగ్‌కు బ్రేక్ పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments