రజనీ చిత్రంలో మరో బాలీవుడ్ విలన్?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీ కాంత్, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీని సంప్రదించారని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి.
'సర్ఫరోష్' (1999) చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన నవాజుద్దిన్ సిద్ధిఖి.. 'కహానీ', 'తలాష్', 'ది లంచ్ బాక్స్', 'బజరంగీ భాయిజాన్', 'మామ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
కాగా.. ఇప్పటికే రజనీ కాంత్ '2.O'లో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తుండగా.. 'కాలా'లో విలన్‌గా మరో బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటులనే ప్రతినాయకులుగా ఎంచుకోవడం అనే విషయంలో.. శంకర్, పా.రంజిత్ బాటలోనే కార్తీక్ సుబ్బరాజ్ కూడా పయనిస్తున్నారన్న విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com