సూపర్‌స్టార్‌తో తలపడనున్న మరో బాలీవుడ్ స్టార్!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాల్లో ఈ మధ్య ఎక్కువగా మెయిన్ విలన్‌గా బాలీవుడ్ స్టార్సే నటిస్తూ వస్తున్నారు. దర్బార్‌లో సునీల్ శెట్టి, పేట్టాలో నవాజుద్దీన్ సిద్ధికీ, కాలాలో నానాపటేకర్ ఇలా బాలీవుడ్‌లో పేరున్న స్టార్స్ అందరూ రజినీని వెండితెరపై ఢీ కొట్టినవారు. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా వీరి లిస్టులో చేరబోతున్నాడు. ఆ స్టార్ ఎవరో కాదు, జాకీష్రాఫ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. జాకీష్రాప్ దక్షిణాదిలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. తెలుగులో ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారీయన.
అయితే తమిళంలో రజినీతో తలపడే మెయిన్ విలన్ పాత్రలో జాకీష్రాఫ్ నటించనుండటం ఇదే తొలిసారి కానుంది. శివ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అణ్ణాత్తే’. ఖుష్బూ, మీనా, కీర్తిసురేశ్ తదితరులు ఈ సినిమాలో నటించనున్నారు. నవంబర్ ద్వితీయార్థంలో కరోనా ప్రభావంతో ఆగిన సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. కరోనా ప్రభావంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com