హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మ‌రో బాలీవుడ్ భామ‌

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

బాలీవుడ్ సొగ‌స‌రులు ఐశ్వ‌ర్యారాయ్‌, ప్రియాంక‌చోప్రా, దీపికా ప‌దుకొనె హాలీవుడ్ చిత్రాల్లో న‌టించి మెప్పించారు. ఇప్పుడు వీరి అడుగు జాడ‌ల్లోనే అడుగు పెడుతున్నారు హ్యుమా ఖురేషి. ర‌జ‌నీకాంత్‌తో 'కాలా' చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు ఇప్పుడు జాక్ స్నిడ‌ర్‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్నారు. జాక్ స్నిడ‌ర్ ' 300', 'మ్యాన్ ఆఫ్ స్టీల్', 'బ్యాట్‌మ్యాన్ వ‌ర్సెస్ సూప‌ర్ మ్యాన్' చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు జాంబిక్ థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కించున్నారు. 'ఆర్మీ ఆఫ్ డెడ్' అనే పేరుతో ఈ జాంబిక్ థ్రిల్ల‌ర్ రూపొంద‌నుంది. జూలై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.