టాలీవుడ్లోకి మరో బాలీవుడ్ నటి...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా రేంజ్ నేడు బాలీవుడ్ సినిమాలను చేరింది. ఇక్కడ క్వాలిటీ సినిమాలు రూపొందుతున్నాయి. అందుకనే బాలీవుడ్ నటీనటులు కూడా దక్షిణాదిన.. ముఖ్యంగా తెలుగులో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు. అలా ఆసక్తితో బాలీవుడ్లో పలు సీరియల్స్, యాడ్స్‌లో నటించిన మోడల్ దివ్యాంశ కౌశిక్ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
వివరాల్లోకెళ్తే.. పెళ్లి తర్వాత చైతన్య, సమంత జంటగా ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పెళ్లైన ఓ జంట మధ్యలో మరో స్త్రీ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందనుందట. చైతు, సమంత భార్యభర్తలుగా నటిస్తుంటే..వారి జీవితంలోకి ప్రవేశించే అమ్మాయి పాత్రలో దివ్యాంశ కౌశిక్ కనపడనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com