లంకలో మరో పేలుడు .. ఆత్మాహుతి దాడుల్లో మహిళ!
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలంకలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు.... మరోసారి పేలుళ్లకు తెగబడ్డారు. దీంతో పేలుళ్లకు కారణం అయిన అధికారులు, భద్రత బలగాల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ముఖ్యంగా అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు శ్రీలంక ను హెచ్చరించిన... దాన్ని పెడచెవిన పెట్టడంతో... మరో సారి బ్లాస్ట్ జరిగింది. ఉగ్రవాదులు బహిరంగ దాడులకు పాల్పడ నున్నారు అని అమెరికా హెచ్చరంచినట్లు గానే... కొలంబోలోని సవొయ్ థియేటర్ ఎదుట బాంబు పేలింది. అయితే అక్కడ జనం లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ... బయట పార్క్ చేసి ఉన్న బైక్ లో బాంబ్ ఉందని గుర్తించక పోవడం మాత్రం భద్రత బలగాల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని రుజువు చేసింది.
ఇటీవల న్యూజిలాండ్ లో జరిగిన పేలుళ్లకు ప్రతీకారంగా శ్రీలంకలో పేలుళ్లు జరిపామని ప్రకటించిన ఐసిస్ ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఒక మహిళ కూడా ఉంది. తొమ్మిది మంది ఆత్మాహుతికి పాల్పడగా... వీరిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మహమ్మద్ యూసఫ్ ఇబ్రహీం కొడుకులు ఇద్దరు ఉన్నారు.వీరిలో ఇంసాత్ సినమెన్ గ్రాండ్ హోటల్ లో... ఇల్హం షాంగ్రిల హోటల్ లో ఆత్మాహుతి దాడి చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజయవర్దనే వెల్లడించారు
శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లు ఆ దేశ ప్రజలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. ఓ ప్రశాంత జీవనాన్ని కలవరానికి గురిచేశాయి. పేలుళ్లలో మృతుల సంఖ్య 359 కి చేరగా....వీరిలో 39 మంది విదేశయులు ఉన్నారు. అందులో పది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరులను అరెస్ట్ చేసే పనిలో పడ్డ భద్రత దళాలు... ఇప్పటి వరకూ 60 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. కాగా... ఉగ్రవాదులు తెగబడతారని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు... ఆ దేశానికి మూడుసార్లు హెచ్చరికలు జారీ చేసారు. కానీ ... ఉగ్రదాడుల ను అడ్డుకోవడంలో విఫలం అయ్యామని... శ్రీలంక ప్రధాని విక్రమ్ సింగే ప్రకటించారు.
శ్రీలంకలో జరిగిన దాడుల్లో మన హైదరాబాదీ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మనికొండకు చెందిన బిల్డర్ మాకినేని శ్రీనివాస్, తన బంధువు వేమూరి తులసి రామ్, స్నేహితులతో కలిసి సమ్మర్ వే ట్రిప్ వెళ్లారు. ఆ సమయంలోనే హోటల్ లో బాంబ్ బ్లాస్ట్ జరగడం తో.... తులసి రామ్ అక్కడికి అక్కడే చనిపోగా... శ్రీనివాస్ కు గాయాలు అయ్యాయి. ఉగ్ర దాడిలో చనిపోయిన తులసి రామ్ మృతదేహం హైదరాబాద్ కు చేరుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com