Gummanur:వైసీపీకి మరో బిగ్ షాక్.. మంత్రి గుమ్మనూరు రాజీనామా..
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడగా.. ఇప్పుడు ఏకంగా మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని.. కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలా పనిచేశానని తెలిపారు. కానీ గతంలో లాగా సీఎం జగన్ లేరు.. ఆయన ఇప్పుడు చాలా మారిపోయారన్నారు. గుడిలో విగ్రహంలా జగన్ మారిపోయారని.. ఆయనకు నాయకులు ఏం చెప్పినా వినిపించడం లేదన్నారు.
జగన్ అనే విగ్రహానికి ఇద్దరు పూజారాలు ఉన్నారని.. వారు చెప్పిందే ఆయన వింటున్నారని చెప్పారు. ఆ ఇద్దరు పుజారులైన సజ్జల రామ కృష్ణా రెడ్డి, ధనునంజయ రెడ్డి కలిసి ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. భక్తులుగా ఉన్న మమ్మల్ని వదిలేసి వారసులను వెనకేసుకొస్తున్నారన్నారు. మంత్రిగా ఉన్నా కూడా తన నియోజకవర్గం ఆలూరు అభివృద్ధి చెందలేదు కానీ పక్కనే ఉన్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్ మాత్రం అభివృద్ధి చెందిందన్నారు. తన నియోజకవర్గం పనులకు సంబంధించి బిల్స్ ఇప్పటి వరకు విడుదల చేయలేదని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారి అయిన ధనుంజయ రెడ్డి వైసీపీ కోసం పని చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కేవలం ఎస్సీలు,బోయాలను మాత్రమే మార్చారని.. రెడ్డి సామాజిక వర్గం నేతలను ఎందుకు తప్పించలేదని జయరాం ప్రశ్నించారు. కేవలం 150 గడపలు ఉన్న చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని.. ప్రజల కష్టుసుఖాలను చూసి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. 12 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మోసానని.. పార్టీలో కష్టపడి రెండుసార్లు ఎమ్మెల్యే , మంత్రిని అయ్యానని చెప్పుకొచ్చారు. 2019లోనే కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని చెప్పినా వద్దని ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు. ఇప్పుడు కూడా ఎంపీగా పోటీ చేయమని అడిగారని.. అది తనకు ఇష్తం లేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
రెండు జిల్లాల్లో పోటీ చేయడానికి టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని.. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తన సామాజిక వర్గంలో తాను పుట్టిన ఊరు కూడా కావడంతో గుంతకల్ నుంచి పోటీ చేయడానికి మొగ్గు చూపినట్లు జయరాం వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments