Gummanur:వైసీపీకి మరో బిగ్ షాక్.. మంత్రి గుమ్మనూరు రాజీనామా..

  • IndiaGlitz, [Tuesday,March 05 2024]

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడగా.. ఇప్పుడు ఏకంగా మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని.. కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలా పనిచేశానని తెలిపారు. కానీ గతంలో లాగా సీఎం జగన్ లేరు.. ఆయన ఇప్పుడు చాలా మారిపోయారన్నారు. గుడిలో విగ్రహంలా జగన్ మారిపోయారని.. ఆయనకు నాయకులు ఏం చెప్పినా వినిపించడం లేదన్నారు.

జగన్ అనే విగ్రహానికి ఇద్దరు పూజారాలు ఉన్నారని.. వారు చెప్పిందే ఆయన వింటున్నారని చెప్పారు. ఆ ఇద్దరు పుజారులైన సజ్జల రామ కృష్ణా రెడ్డి, ధనునంజయ రెడ్డి కలిసి ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. భక్తులుగా ఉన్న మమ్మల్ని వదిలేసి వారసులను వెనకేసుకొస్తున్నారన్నారు. మంత్రిగా ఉన్నా కూడా తన నియోజకవర్గం ఆలూరు అభివృద్ధి చెందలేదు కానీ పక్కనే ఉన్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్ మాత్రం అభివృద్ధి చెందిందన్నారు. తన నియోజకవర్గం పనులకు సంబంధించి బిల్స్ ఇప్పటి వరకు విడుదల చేయలేదని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారి అయిన ధనుంజయ రెడ్డి వైసీపీ కోసం పని చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కేవలం ఎస్సీలు,బోయాలను మాత్రమే మార్చారని.. రెడ్డి సామాజిక వర్గం నేతలను ఎందుకు తప్పించలేదని జయరాం ప్రశ్నించారు. కేవలం 150 గడపలు ఉన్న చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని.. ప్రజల కష్టుసుఖాలను చూసి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. 12 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మోసానని.. పార్టీలో కష్టపడి రెండుసార్లు ఎమ్మెల్యే , మంత్రిని అయ్యానని చెప్పుకొచ్చారు. 2019లోనే కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని చెప్పినా వద్దని ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు. ఇప్పుడు కూడా ఎంపీగా పోటీ చేయమని అడిగారని.. అది తనకు ఇష్తం లేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

రెండు జిల్లాల్లో పోటీ చేయడానికి టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని.. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తన సామాజిక వర్గంలో తాను పుట్టిన ఊరు కూడా కావడంతో గుంతకల్ నుంచి పోటీ చేయడానికి మొగ్గు చూపినట్లు జయరాం వెల్లడించారు.

More News

Chandrababu:తనపై నమోదుచేసిన కేసుల వివరాలు ఇవ్వండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ..

మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

12th Fail:తెలుగులోనూ '12th ఫెయిల్' స్ట్రీమింగ్.. ఏ ఓటీటీలో అంటే..?

ఇటీవల హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం '12th ఫెయిల్'. ప్రముఖ IPS ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా

Nihar Kapoor:జయసుధ వారసుడు.. 'రికార్డ్ బ్రేక్' హీరో నిహార్ కపూర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

అలనాటి హీరోయిన్ జయసుధ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నిహార్ కపూర’ హీరోగా 'రికార్డ్ బ్రేక్' అనే సినిమాలో నటించారు. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో

Chandrababu:వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

వాలంటీర్లు వైసీపీ కోసం మాత్రం పనిచేయవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

BRS Party: నాలుగు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే..?

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిపెడుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేలా వ్యూహాలు రచిస్తు్న్నారు.