రేవంత్ రెడ్డికి మరో కోలుకోలేని షాక్..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని రీతిలో కొడంగల్‌లో ఘోరంగా ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వరుస షాక్‌లు వెంటాడుతున్నాయి. ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోటుకుంటున్న రేవంత్.. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను ఆచితూచి నిలబెట్టిన ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అనుకుంటున్నారు. అయితే రేవంత్ ఎత్తులన్నీ చిత్తు చేస్తూ టీఆర్ఎస్ పైఎత్తులు వేస్తోంది.
అసలేం జరిగింది..
కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థి విశ్వనాథ్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నిద్రిస్తున్న ఆయన్ను బుధవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు. కాగా ఈయన నేడు నిటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయాల్సి ఉంది. నామినేషన్ దాఖలుకు ఇవాళ చివరి రోజు కావడంతో అసలు విశ్వనాథ్ ఏమయ్యాడో..? ఎవరు కిడ్నాప్ చేశారో తెలియక ఓ వైపు ఆయన కుటుంబీకులు మరోవైపు రేవంత్ రెడ్డి టెన్షన్ పడుతున్నారు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల్లో సోదాలు.. అరెస్టులతో టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సర్పంచ్ ఎన్నికలు జరగనుండటంతో మరోసారి ఇలా ఇబ్బందులు పెడుతోందని ఆయన అభిమానులు, అనుచరులు సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా విశ్వనాథ్ అనే వ్యక్తి రేవంత్‌రెడ్డి అనుచరుల్లో ఒకరని తెలుస్తోంది. రేవంత్ రాజకీయాల్లోకి వచ్చినప్పట్నుంచి ఆయనకు అనుచరుడిగా ఉంటూ వస్తున్నారని సమాచారం.
రంగంలోకి రేవంత్..!
మరోవైపు రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి.. విశ్వనాథ్‌ను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. కిడ్నాప్ వ్యవహారంపై రేవంత్ నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్పీ అన్నపూర్ణ.. హుటాహుటిన పోలీసులతో గ్రామానికి చేరుకుని విచారిస్తున్నారు. కాగా గతంలో ఇదే గ్రామంలో ఎన్నికల సమయంలో పలు హత్య జరిగిన ఉదంతాలున్నాయి. అయితే విశ్వనాథ్‌ను కిడ్నాప్ చేశారా..? ఇంకేమైనా చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి టీఆర్ఎస్, స్థానిక నేతలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే వీటన్నింటినీ.. పొట్టివాడైనా రేవంత్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొని ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. సర్పంచ్ ఎన్నికలకే ఇలాంటి పరిస్థితులుంటే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉంటుందో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments