మెగాస్టార్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్స్ కూడా..!

మెగ‌స్టార్ చిరంజీవితో పాటు మ‌రో ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్స్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. అంటే మొత్తానికి ముగ్గురు త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్‌ను కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంత‌కీ చిరంజీవితో పాటు ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌డానికి రానున్న‌ ఆ ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్స్ ఎవ‌రో తెలుసా... ఒక‌రు మోహ‌న్‌లాల్ అయితే, మ‌రొక‌రు బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌. ఈ ముగ్గురు టాప్ హీరోలు ఒకేరోజున త‌మ సినిమాల‌ను విడుద‌ల చేస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన ఆచార్య చిత్రం మే 13న విడుదల‌కానుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్‌లో ఒక‌రైన స‌ల్మాన్‌ఖాన్, ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా రాధే కూడా ఈద్ సంద‌ర్భంగా మే 13నే విడుద‌ల కానుంది. ద‌బాంగ్‌తో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం స‌క్సెస్ కాలేదు. మ‌రి ఈసారైనా రాధేతో స‌ల్మాన్‌ఖాన్ ద‌క్షిణాది ప్రేక్ష‌కుల ముందుకు వస్తాడో రాడోన‌ని చూడాలి. ఇక మ‌రో స్టార్ హీరో మోహ‌న్‌లాల్‌..మ‌రక్కార్ అరేబియా సింహం చిత్రంతో మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెలుగులోనూ విడుద‌ల కానుంది. మ‌రి ఈ ముగ్గురు స్టార్స్‌లో ఎవ‌రు ఎలా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనున్నారో చూడాలంటే స‌మ్మ‌ర్ వ‌ర‌కు ఆగాల్సిందే.