చిరు చిత్రంలో మరో ఇద్దరు స్టార్స్ ఓకే అయినట్లే...
Send us your feedback to audioarticles@vaarta.com
`ఖైదీ నంబర్ 150`చిత్రంతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి తెరపై కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాపవర్‌స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవితో నయనతార నటించడం దాదాపు ఖాయమని అంటున్నారు. అలాగే మరోవైపు అనుష్క పేరు కూడా వినపడుతుంది. ఇక బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడట. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న లాంచనంగా ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com