నూతన్ నాయుడిపై మరో రెండు కేసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నూతన్ చేసిన ఘన కార్యాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా నూతన్ నాయుడుపై మరో రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
నూతన్ ఏపీతో పాటు తెలంగాణలోనూ మోసాలకు పాల్పడినట్టు స్పష్టమైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి బ్యాంకులో డైరెక్టర్ పోస్ట్ ఇప్పిస్తానంటూ రూ. 20 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. అలాగే.. తెలంగాణకు చెందిన వ్యక్తికి ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నాలుగు లక్షలు వసూలు చేసినట్లు కూడా స్పష్టమైంది. అయితే.. నాలుగు లక్షలు చెల్లించిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో నూతన్‌ను బాధితుడు ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఆగ్రహానికి లోనైన నూతన్ సాగరతీరంలో హోటల్‌కు బాధితుడ్ని పిలిచి దుర్భాషలాడినట్టు తెలియవచ్చింది.
పెందుర్తి శిరోముండనం కేసులో నూతన్ కుటుంబ అరాచకాలను మీడియాలో చూడటంతో తమకు జరిగిన అన్యాయంపై పలువురు బాధితులు తమకు నూతన్ కారణంగా జరిగిన అన్యాయాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో నూతన్ నాయుడును సెంట్రల్ జైలు నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments