కరోనా వైరస్‌పై మరో సినిమా ..
Send us your feedback to audioarticles@vaarta.com
ట్రెండ్‌కు తగ్గట్టు సినిమాలను నిర్మించడం మన మేకర్స్‌కు అలవాటు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని పారదోలడానికి అందరూ కష్టపడుతున్నారు. మన దేశం విషయానికి వస్తే మే 3వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ సహా మేకర్స్ అందరూ కరోనా వైరస్‌పై సినిమాలను చేస్తున్నారు. తొలుత కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించింది. దీన్ని ‘21 డేస్’ పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు. ఎం.విజయ్ భాస్కర్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా యాదృచ్చికంగా కరోనా వైరస్‌ను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పైగా పూర్తయ్యింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే మిగిలిన భాగాన్ని చిత్రీకరించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ప్రశాంత్ వర్మ కూడా భాగమని అంటున్నారు. అందరూ కొత్త నటీనటులే నటిస్తున్నారు. అ!, కల్కి చిత్రాల తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. మరి లేటెస్ట్ ట్రెండ్‌కు తగినట్లు సినిమాలను తెరకెక్కిస్తున్న మన మేకర్స్‌ను ప్రేక్షకులను ఎలా ఆదరిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments