ఏడాదికొకటి చేస్తున్న అనూప్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్‌లో హవా చూపిస్తున్న సంగీత దర్శకులలో అనూప్ రూబెన్స్ ఒకరు. ప్రేమకావాలి, ఇష్క్, మనం, టెంపర్, సోగ్గాడే చిన్ని నాయనా తదితర చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అనూప్.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
ఇదిలా ఉంటే.. ఆ మధ్య అక్కినేని ఫ్యామిలీ హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన అనూప్.. ఇప్పుడు నందమూరి హీరోలతోనూ సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే.. సంవత్సరానికో నందమూరి హీరో సినిమా అనూప్ ఖాతాలో పడుతోంది.
2015లో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన టెంపర్ చిత్రానికి సంగీతమందించిన అనూప్.. 2016లో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఇజం చిత్రానికి స్వరాలు అందించాడు. ఇక ఈ ఏడాదిలో బాలకృష్ణ హీరోగా రూపొందిన పైసా వసూల్ చిత్రానికి స్వరకర్తగా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. విశేషమేమిటంటే.. ఈ మూడు చిత్రాలకూ పూరీ జగన్నాథే దర్శకుడు కావడం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments