నాగ్ స్టూడియోలో వెంకీ మూవీ...
Tuesday, April 5, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న బాబు..బంగారం షూటింగ్ జరుపుకుంటుంది. యువ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పది రోజులు పాటు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేయనున్నారు. ఆతర్వాత విదేశాల్లో రెండు పాటలను చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుంది.
ఉగాది కానుకగా ఈ నెల 8న బాబు..బంగారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో వెంకీ సరసన నయనతార నటిస్తుంది. ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తులసి, లక్ష్మి తర్వాత వెంకీ - నయనతార జంటగా నటిస్తున్న బాబు..బంగారం సెంటిమెంట్ పరంగా సక్సెస్ ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. కానీ...యువ దర్శకుడు మారుతికి సీనియర్ హీరోని డైరెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మరి..సీనియర్ హీరో వెంకీని కొత్తగా ఎలా చూపించనున్నాడో..? ఈ ప్రయత్నంలో మారుతి ఎంత వరకు సక్సెస్ అవుతాడో..? చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments