Annapurna Studios:‘‘ది ఎఎన్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్’’ : అన్నపూర్ణ స్టూడియోస్- క్యూబ్ సినిమాల అరుదైన ఆవిష్కరణ .. ఏంటీ దీని స్పెషాలిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
చిత్ర పరిశ్రమలో కాలానికి తగినట్లుగా మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగినట్లుగా మార్చుకున్న వ్యక్తులు, సంస్థలు మాత్రమే ఇక్కడ నిలబడగలుగుతారు. ఈ విషయం ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇకపోతే.. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాణ రంగంలో సుదీర్ఘ అనుభవం వున్న సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చేతుల్లో పురుడు పోసుకున్న ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దీనికి ఆధునిక సొబగులు అద్దుతూ మరింత ఎత్తులో నిలబెడుతున్నారు నాగార్జున.
స్క్రిప్ట్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌లోకి అడుగుపెడితే చాలు :
11 షూటింగ్ ఫ్లోర్లతో, అద్భుతమైన లొకేషన్ ఫెసిలిటీస్‌తో ఫిల్మ్ అండ్ మీడియా ఇండస్ట్రీకి అందుబాటులో ఉంది అన్నపూర్ణ స్టూడియో. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టీపీయన్ సర్టిఫికెట్ పొందిన సంస్థ ఇది. డాల్బీ అప్రూవ్డ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీలున్న సంస్థగానూ గుర్తింపు పొందింది. డేటా స్టోరేజ్, వీడియో ఎడిటింగ్, ఆడియో డబ్బింగ్, 4కె కలర్ గ్రేడింగ్, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ క్లాస్ డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ మాస్టరింగ్ వంటి సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ తో లోపలికి వెళ్తే, పూర్తిస్థాయి సినిమాతో బయటకు వచ్చే విధంగా అన్ని రకాల సదుపాయాలను అందిస్తోంది. సినిమాలు, టీవీ, డిజిటల్ షోస్, స్పెషల్ ఈవెంట్స్, అడ్వర్‌టైజింగ్ కమర్షియల్స్, మ్యూజిక్ వీడియోస్ ఇలా ఏం కావాలన్నా షూట్ చేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తోంది.
ఇండియన్ మూవీ లవర్స్‌కి కొత్త అనుభూతిని పరిచయం చేస్తున్న క్యూబ్ సినిమా :
అటు భారతదేశ సినిమా ప్రేక్షకులకు థియేటర్లలో కొత్త అనుభూతిని పరిచయం చేస్తోంది క్యూబ్ సినిమా. మూవీ టెక్నాలజీలోనూ, సొల్యూషన్స్ లోనూ ఈ సంస్థది అందెవేసిన చేయి.
ఈ రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది క్యూబ్ సినిమాకు. ఫిల్మ్ మేకర్స్‌కి డిజిటల్ ఎన్విరాన్‌మెంట్‌ని సమకూర్చడంతో పాటు ఎగ్జిబిటర్స్, ఆడియన్స్‌కి పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీలను కూడా కల్పిస్తోంది. క్యూబ్ త్రీ ప్రాజెక్టులను ఫిల్మ్ మేకింగ్ నుంచి ఎగ్జిబిషన్ ప్రాసెస్ వరకు ప్రతి స్టెప్‌లోనూ వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లో వేల కొలది ఇన్‌స్టాలేషన్స్ ఉన్న సంస్థ ఇది . గ్లోబల్ సినిమా బిజినెస్‌కి అనువుగా కావాల్సిన అన్ని హంగులనూ అమరుస్తోంది క్యూబ్ సర్వీస్. అలాగే మన దేశవ్యాప్తంగా 4వేల స్క్రీన్స్ ఉన్నాయి.
ప్రపంచంలోని ఏ మూలకైనా వర్చువల్‌గా వెళ్లొచ్చు :
అలాంటి అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమాలు ఇప్పుడు చేతులు కలిపాయి. ఈ రెండు సంస్థలూ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘‘ ది ఎఎన్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్‌ని’’ ఏర్పాటు చేశాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఐసీవీఎఫ్‌ఎక్స్ (ఇన్ కెమెరా విజువల్ ఎఫెక్ట్స్ ) వల్ల ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్ ప్రాసెస్‌ని సులభతరం చేయడానికి వీలవుతుంది. ఎఎన్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ఈ విషయం మీద 2022 అక్టోబర్ నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు, యాడ్స్, మ్యూజిక్ వీడియోలను కూడా షూట్ చేసింది. వాటన్నిటినీ పరిశీలించాకే వర్క్ ఫ్లో సొల్యూషన్ నాణ్యత బావుందని ఫిల్మ్ మేకర్స్ కి అందుబాటులోకి తీసుకొచ్చారు. కటింగ్ ఎడ్జ్, హై బ్రైట్‌నెస్, 60 అడుగుల వెడల్పు, 20 అడుగులు ఎత్తు , 2.3 మిల్లీ మీటర్ల డాట్ పిచ్ (అల్ట్రా హై రెఫ్రెష్ రేట్, వైడ్ కలర్ గమట్) ఉన్న ఎల్‌ఈడీ వాల్ స్పాన్నింగ్ అందులో ఉంటాయి. వాటన్నిటికీ మించి ఆటో లెడ్ డిస్‌ప్లేలుంటాయి. రెడ్‌స్పై, పవర్‌ఫుల్ కస్టమ్ బిల్ట్ రెండరింగ్ సిస్టమ్స్, అన్‌రియల్ ఇంజిన్‌తో కాంప్లెక్స్ ఫొటో రియలిస్టిక్ వర్చువల్ లొకేషన్స్ ని రియల్ టైమ్ రెండరింగ్ చేయడం వంటివాటిని అందుబాటులో వుంచారు. వీటన్నిటినీ ఉపయోగించుకుని రియల్, వర్చువల్ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసి ప్రపంచంలోని ఎలాంటి ప్రదేశానికైనా ఫిజికల్‌గా వెళ్లకుండానే షూటింగ్ చేసుకోవచ్చు. తమ సృజనకు అనుగుణంగా వాతావరణాన్ని, లైటింగ్‌ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
అందుకే క్యూబ్‌తో చేతులు కలిపాం : నాగార్జున
దీనిపై నాగార్జున మాట్లాడుతూ.. మా వినియోగదారులకు కట్టింగ్ ఎడ్జి సర్వీసులు అందించడానికి ఏఎన్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ తనవంతు కృషి చేస్తుందన్నారు. సినిమాల నిర్మాణంలో మా బలం, మా అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో క్యూబ్‌కున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తాము చేతులు కలిపామని నాగ్ తెలిపారు. సృజనాత్మక రంగంలో ఎలాంటి సరిహద్దులు లేకుండా తెరమీద ఆవిష్కరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నామని నాగార్జున చెప్పారు.
కంటెంట్ ప్రొడక్షన్‌లో ఇది కొత్త యుగం : క్యూబ్ సినిమా కో ఫౌండర్ పంచపకేశన్
క్యూబ్ సినిమా కో ఫౌండర్ పంచపకేశన్ మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కంటెంట్ ప్రొడక్షన్‌లో ఇది కొత్త యుగమన్న ఆయన ఫిల్మ్ మేకర్స్ కి అత్యంత అనువైన, హైలీ ఎఫిషియంట్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్‌లో తాము ఈ వెసులుబాటు తీసుకొస్తున్నామని పంచపకేశన్ చెప్పారు. కంటెంట్ ప్రొడక్షన్‌లో వర్చువల్ ప్రొడక్షన్ అనేది అత్యంత ప్రశంసనీయమైన అభ్యున్నతి అన్న ఆయన.. ఇలాంటి విషయంలో తాము ముందంజలో ఉండటం ఆనందంగా ఉందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com