అప్పట్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉండేది: అన్నపూర్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎందరో నటీమణులు వెల్లడించారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆయా ఇండస్ట్రీల నటీమణులు పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే దీనిపై శ్రీరెడ్డి పెద్ద ఉద్యమమే చేసింది. నటి మాధవీలత సైతం ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అవకాశాల కోసం కమిట్‌మెంట్ తప్పనిసరి అని పలువురు నటీమణులు వెల్లడించారు. అయితే తాజాగా దీనిపై ఒక ప్రముఖ సీనియర్ నటి సైతం స్పందించారు. ఆమె మరోవరో కాదు.. అన్నపూర్ణ. ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 3’లో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నపూర్ణ క్యాస్టింగ్ కౌచ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన అనుభవాలను అన్నపూర్ణ గుర్తు చేసుకున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది అనవసరపు వ్యవహారమంటూనే.. అప్పట్లో తమకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. అప్పట్లో కూడా అవకాశాల కోసం వేధించేవారని.. అవకాశం ఇస్తే తమకేంటని వెంట పడేవారని అన్నపూర్ణ వెల్లడించారు. అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చేదని.. పాతికేళ్లకే అమ్మ వేషాలు వేయాల్సి వచ్చేదని తెలిపారు. హీరోయిన్‌గా తనకు అవకాశాలు వచ్చినప్పటికి రెండు సినిమాలతోనే ఆపేశానని వెల్లడించారు. అదే అమ్మ వేషాలైతే అలాంటివి ఉండవని అలా చేయాల్సి వచ్చేదన్నారు. కానీ అప్పుడు కూడా ఉండేవని అయితే ముందుగానే అలాంటి పనులు చేయమని ఒప్పందం ఇస్తేనే డేట్స్ ఇచ్చేవాళ్లమని అన్నపూర్ణ వెల్లడించారు.
అయితే తప్పు అనేది ఎప్పుడూ ఒకరి వైపే ఉండదని.. ఇద్దరికీ ఇష్టమైతేనే అలాంటి తప్పులు జరుగుతాయని అన్నపూర్ణ పేర్కొన్నారు. అయితే ఇది ఒక్క సినీ రంగానికే పరిమితం కాదని.. ప్రతి రంగంలోనూ మహిళలు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటున్నారన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, కుటుంబ గౌరవాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు వేటికి లొంగకుండా తప్పించుకు వస్తున్నారన్నారు. సినీ పరిశ్రమలోని వాళ్లు కూడా అదే విధంగా తప్పించుకోవాలని సూచించారు. ఒకవేళ అలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే నోరు విప్పాలని అన్నపూర్ణ వెల్లడించారు. అయితే తప్పులు జరగవని తాను చెప్పడం లేదని, ఇక్కడ కచ్చితంగా తప్పులు జరుగుతాయన్నారు. అయితే ఆ తప్పు ఇద్దరికీ సమ్మతమైతేనే జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇక అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఇక్కడ కష్టాలు తప్పవని అన్నపూర్ణ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments