అంకిత-విశాల్ వివాహాం

  • IndiaGlitz, [Wednesday,March 30 2016]

1980 లో ఐ లవ్ యు రస్నా...! అంటూ...ముద్దుముద్దు మాట‌ల‌తో ప‌ల‌క‌రించి...ఆత‌ర్వాత లాహిరి లాహిరి లాహిరి చిత్రం తో దర్శకుడు వై వి యస్ చౌదరి తెలుగు తెరకు పరిచయం చేసిన హీరోయిన్ 'అంకిత. తెలుగు తమిళ్ లలో సుమారు 20 చిత్రాలలో నటించింది. గత 7 ఏళ్ళు గా లైం లైట్ లో లేని అంకిత అమెరికా లో తన తండ్రి వజ్రాల వ్యాపారం చూసుకుంటుంది. పూణే కు చెందినా యన్ ఆర్ ఐ 'విశాల్ జగ్తాప్' అమెరికా లో పరిచయం అయ్యాడు. ఇరువురు పెద్దల అంగీకారంతో పెళ్లి నిత్చితార్ధం జరుపుకుని, ఈనెల‌ 28న పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ముంబై, వర్లీ లోని ఓ హోటల్ లో వివాహం,రిసెప్షన్ ఘనంగా జరుపుకున్న ఈ కార్యక్రమానికి దంపతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

More News

నాగార్జున 'శ్రీరామదాసు' కి పదేళ్లు

'అన్నమయ్య','సంతోషం' చిత్రాల తరువాత అక్కినేని నాగార్జునకి ముచ్చటగా మూడోసారి నంది అవార్డుని అందించిన చిత్రం' శ్రీరామదాసు'.

ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న నాగార్జున, కార్తీ, పివిపిల 'ఊపిరి'

కింగ్ నాగార్జున,ఆవారా కార్తీ,మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి.సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు,తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి,కవిన్ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్ 'ఊపిరి'.

ఏప్రిల్ 1 వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 7 టు 4.

రాత్రి 7గంటల నుండి ఉదయం 4గంటల వరకు పూర్తిగా ఒక రాత్రిలో జరిగే ఆసక్తికర కథతో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం '7టు 4'.

బన్ని ట్విట్టర్ లో అయాన్ ట్వీట్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ఫేస్ బుక్ -ట్విట్టర్ లోఎంత పాపులరో తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీలో బాహుబ‌లి..

అసెంబ్లీ స‌మావేశాలు అంటే...రాజ‌కీయాలు త‌ప్ప మ‌రో అంశం గురించి ప్ర‌స్తావ‌నే ఉండ‌దు. ఇక సినిమాల గురించి ప్ర‌స్తావ‌న ఉండ‌నే ఉండ‌దు. ఒక‌వేళ సినిమాల‌ గురించి చ‌ర్చించినా అది వివాద‌స్ప‌ద‌మే అవుతుంది.