తొలిసారి అలాంటి పాత్ర‌లో అంజ‌లి

  • IndiaGlitz, [Wednesday,October 30 2019]

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'నిశ్శ‌బ్దం'. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో మాధ‌వ‌న్ షాలిని పాండే, అంజ‌లి, సుబ్బ‌రాజ్, హాలీవుడ్ న‌టుడు మ్యాడ్‌స‌న్‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా విడుద‌ల కానుంది. నిశ్శ‌బ్దం షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జ‌రిగింది. అక్క‌డ చిత్రీక‌ర‌ణ‌కు అనువైన వాతావ‌ర‌ణం వ‌చ్చే వ‌ర‌కు వేచి చూసి మ‌రీ తెర‌కెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్‌, ఆంగ్లంలో విడుద‌ల చేయ‌నున్నారు. కాగా ఈ సినిమాలో అంజ‌లి పాత్ర‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి తెలిసింది.

ఈ సినిమాను అమెరికా బ్యాక్‌డ్రాప్‌లోనే చిత్రీక‌రించారు. కాబ‌ట్టి అంజ‌లి అమెరికాలోని సీటెల్ ప్రాంతానికి చెందిన లేడీ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుందట‌. తొలిసారి అంజ‌లి ఉమెన్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమె సీటెల్ పోలీస్ ఆఫీస‌ర్స్ బాడీ లాంగ్వేజ్‌ను గ‌మ‌నించ‌డ‌మే కాదు.. బ‌రువు కూడా త‌గ్గింద‌ట‌. అనుష్క పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు.

More News

ల‌స్ట్ స్టోరీస్‌లో ఈషా రెబ్బా

తెలుగు హీరోయిన్ అయిన‌ప్ప‌టికీ తెలుగు సినిమాల్లో అవ‌కాశాల కోసం ఈషా రెబ్బా ఎక్కువ‌గా ఎదురుచూడాల్సి వ‌స్తుంది.

'ఆవిరి' హార‌ర్ చిత్రం కాదు.. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ - ర‌విబాబు

`అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2` ..వంటి ప‌లు చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు .

అల్లు అర్జున్,  సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో,  క్రేజీ మూవీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించే క్రేజీ మూవీ బుధవారం (అక్టోబర్ 30న) ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

బతికుంటే గెలుస్తూనే ఉంటా.. చచ్చిపోతా: పేకాట ‘కింగ్’

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బావాజీ అనే ప్లేయింగ్ కార్డ్స్‌లో కింగ్.. కంటిచూపుతోనే లాఘవం ప్రదర్శిస్తున్నాడు. జూదంలో లోపల, బయట

50:50పై తగ్గే ప్రసక్తే లేదంటున్న శివసేన.. బీజేపీ ఏం చేస్తుందో!?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా బీజేపీ-శివసేన ఇంకా కొలిక్కిరాలేదు. సీఎం పదవి ఇచ్చితీరాల్సిందేనని శివసేన పట్టువీడట్లేదు. వాస్తవానికి ఇరు పార్టీల మధ్య