విష్ణుతో రొమాన్స్ చేస్తున్న అంజలి...
Send us your feedback to audioarticles@vaarta.com
షాపింగ్ మాల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి...ఇలా విభిన్నకథా చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న అందాల నాయిక అంజలి. తాజాగా నిఖిల్ నటించిన శంకరాభరణం చిత్రంలో నటించింది. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. అలాగే అంజలి నందమూరి నట సింహం బాలక్రిష్ణ తో కలసి డిక్టేటర్ మూవీలో నటిస్తుంది.
ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. తాజాగా మంచు విష్ణు నటిస్తున్న సరదా సినిమాలో అంజలి ఓ ముఖ్యపాత్ర పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అడ్డా ఫేం కార్తీక్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు సరసన సోనారిక నటిస్తున్న విషయం తెలిసిందే. మరి..ఈ మూవీలో అంజలి ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com