బాలయ్యను అలా అనేసిందేంటి....?
- IndiaGlitz, [Monday,December 21 2015]
పెద్ద పెద్ద నిర్మాతలు సైతం నందమూరి బాలకృష్ణతో మాట్లాడాలంటే భయపడుతుంటారు. ఎక్కడ తేడాగా మారినా లెక్కలు మారిపోతాయి. ఈ విషయం బయటకు ఎవరూ పెద్దగా మాట్లడరు. కానీ హీరోయిన్ విషయం విషయంలో లెక్కలు మారిపోతాయని తెలిసిపోయింది. సాధారణంగా షూటింగ్ ల విషయంలో హీరో హీరోయిన్లు ఒక వయసు వాళ్ళయితే ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకోవడం కామన్ గానే జరుగుతుంటుంది. కానీ స్టేజ్ పై జరిగే వేడుకలకు వచ్చేసరికి ఎవరి లెక్కలు వారికుంటాయి.
అసలు విషయంలోకి వెళితే నిన్న అమరావతిలో జరిగిన ఆడియో వేడుకలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించిన అంజలి బాలయ్యను బాల అని సంబోధించింది. ఇది విన్న అందరూ షాక్ అయ్యారు. యూనిట్ సభ్యులు ముసి ముసిగా నవ్వుకున్నారు. బాలకృష్ణ కూడా కినుక వహించడం కొసమెరుపు. షూటింగ్ సమయంలో ఎంత చనువిచ్చినా, బాలకృష్ణను స్టేజ్ పై అలా సంబోధించడం ఏంటని నోళ్ళు నొక్కుకుంటున్నారు.