ఆ సీన్ చూసి పవన్ చప్పట్లు కొట్టారు.. ఎగిరి గంతులేశా..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కంప్లీట్ చేసుకుంటోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ సినిమా అంచనాలు పెంచేయగా.. ఈ మధ్యనే రిలీజ్ అయిన ట్రైలర్‌తో అభిమానులు, జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ట్రైలర్ రిలీజ్ రోజున ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎంజాయ్ చేశారో ఇక చెప్పక్కర్లేదు. కాగా.. ఏప్రిల్-09న సినిమా థియేటర్లలోకి రానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. తాజాగా.. ఈ సినిమాలో నటించిన తెలుగమ్మాయి అంజలి మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు, పవన్‌తో కలిసి నటించడంతో ఈ భామ ఎలా ఫీలయ్యింది..? అనే విషయాలు తెలుసుకుందాం.
ఎగిరి గంతులేశా..
పవన్ గారి పేరు చెప్పగానే ఎగిరి గంతేశాను. కల్యాణ్ సార్‌తో సినిమా చేస్తున్నాననే విషయం తెలిసినప్పుడు నా ఆనందానికి హద్దుల్లేవ్.. ఎగిరి గంతులేశాను. ఆయన.. సెట్లో చాలా కామ్‌గా ఉంటారు. చైర్ వేసుకొని కూర్చొంటారు. ప్రారంభంలో ఆయనతో మాట్లాడాలా? వద్దా? అనే బిడియం ఉండేది. ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఆయన గురించి పూర్తిగా తెలిసింది. ఆయన డిగ్నిఫైడ్‌గా ఉంటారు. ఎదుటి వారికి మర్యాద చాలా ఇస్తారు.
చాలా హ్యాపీ.. మరిచిపోలేని అనుభవం..
నేను పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నా. మంచి మంచి పాత్రలే చేస్తున్నాను. నా కెరీర్ పట్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. మరో లెవెల్ గురించి నేను ఆలోచించలేదు.. ఆలోచించను కూడా. మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నా. ‘వకీల్ సాబ్’ సినిమా విషయానికొస్తే.. ‘డబ్బులు తీసుకొన్నాం’ అనే ఎమోషనల్ సీన్.. డైలాగ్‌తో కూడిన సీన్ ఉంటుంది. ఆ సీన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు సెట్లో పవన్ కల్యాణ్ గారు ఉన్నారు. ఆ సీన్ పూర్తవ్వగానే ఆయన లేచి చప్పట్లు కొట్టి నన్ను అభినందించారు. పవన్ సాధారణంగా అలా రియాక్ట్ కావడం చాలా అరుదు. నేను నటించిన సీన్ చూసి చప్పట్లు కొట్టడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. దీన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను.. ఇదొక మరవలేని అనుభవం.
‘పింక్’తో పోలికలే ఉండవ్..
‘పింక్’ సినిమాతో ‘వకీల్ సాబ్’ కు అస్సలు పోలికలే ఉండవు. పింక్ సినిమా నేను హిందీలో చూశాను. ఆ సినిమాలో నా పాత్రకు సంబంధించి చాలా మార్పులు, చేర్పులు చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆ మార్పులేమిటో కొంత వరకే అర్ధమైంది. సినిమా చూస్తే ఆ మార్పులు పూర్తిగా అర్థమవుతాయ్. హిందీ ‘పింక్’కు, మన ‘వకీల్ సాబ్’కు పోలీకలే ఉండవు.
చాలా ముచ్చటేసింది..
కొద్ది రోజుల వరకు సెట్లో చాలా నెర్వెస్‌గా ఉంది. నేను సెట్లో ఎక్కువగా మాట్లాడేస్తుంటాను.. కానీ పవన్ సార్ ఒక్కసారిగా సెట్లో అడుగుపెడితే పిన్ డ్రాప్ అంతా సైలెన్స్‌గా మారిపోతుంది. షూట్ చకచకగా జరిగిపోతుంది. తొలి రెండ్రోజులు నాకు కొంత భయాలు ఉండేవి. కానీ.. పవన్ గారు స్క్రిప్టు మీద పెట్టే ఏకాగ్రత చూసి నాకు చాలా ముచ్చటేసింది. నివేదా థామస్, అనన్య నాగళ్లతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. మా ముగ్గురికి కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయ్. మా మధ్య కనెక్టివిటి లేకపోతే సీన్లు పండేవి కాదు. లక్కీగా మా మధ్య అలాంటి బాండింగ్ ముందు నుంచే ఏర్పడింది. మా మధ్య ఎలాంటి ఇగోలు లేవు. సినిమా మొత్తం చూసిన తర్వాత మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
డైరెక్టర్‌కు థ్యాంక్స్.. నేను రేసులోనే ఉన్నా..
‘వకీల్ సాబ్’ డైరెక్టర్‌కు థ్యాంక్స్. సాధారణంగా పెద్ద హీరో సినిమాలో ఇతర క్యారెక్టర్లు గాలికి కొట్టుకుపోతాయి. కానీ ‘వకీల్ సాబ్’లో ఎన్ని మార్పులు చేసినప్పటికీ మా పాత్రలు చాలా భద్రంగా, ఎమోషనల్‌గానే ఉన్నాయి. ఈ సినిమా చేయడానికి ముందు ఏదైతే దర్శకుడు వేణు శ్రీరాం చెప్పారో అదే తెరపైన కనిపించింది. అందుకు డైరెక్టర్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. కెరీర్ గురించి చెబుతూ.. నేను ఎప్పటినుంచో రేసులోనే ఉన్నాను. టాలీవుడ్ లో నాకు మంచి అవకాశాలే వచ్చాయి. అన్ని రకాల పాత్రలూ చేశాను. హీరోయిన్గా కనిపించా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశా. హార్రర్ కథలూ చేశా.. అవకాశాల పరంగా ఎప్పుడూ అసంతృప్తికి లోను కాలేదు. ఎవరో పోటీకి వచ్చేస్తున్నారని కూడా భయపడలేదు. నాకంటూ కొన్ని అభిరుచులు ఉన్నాయి. తెలుగులో త్వరలోనే ఓ పెద్ద సినిమా చేయబోతున్నా. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు చెబుతాను.. అని ఇంటర్వ్యూలో అంజలి చెప్పింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments