నెలకొకటి.. ఇదీ అంజలి లెక్క
Send us your feedback to audioarticles@vaarta.com
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బలుపు', 'గీతాంజలి'.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతోంది తెలుగమ్మాయి అంజలి. మధ్యలో చేసిన 'మసాలా'ని మినహాయిస్తే.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అంజలి హవా బాగానే సాగుతున్నట్లే. అందుకే ప్రస్తుతం ఈ బబ్లీ గర్ల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. 'శంకరాభరణం', 'చిత్రాంగద', 'డిక్టేటర్' చిత్రాలే ఆ మూడు సినిమాలు. ఈ మూడు సినిమాలు కూడా నెలకొకటి చొప్పున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
నిఖిల్, నందిత జంటగా నటించిన 'శంకరాభరణం'లో అంజలిది ఓ కీలక పాత్ర. ఈ సినిమా నవంబర్‌లో దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇక హీరోయిన్ సెంట్రిక్ చిత్రమైన 'చిత్రాంగద' డిసెంబర్‌లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ ఫిల్మ్‌లో అంజలి ఇప్పటివరకు ఎప్పుడూ చేయని విభిన్నమైన పాత్రని చేస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణతో తొలిసారిగా జోడి కడుతున్న 'డిక్టేటర్' సినిమా ఏమో సంక్రాంతి కానుకగా జనవరి ప్రథమార్థంలో సందడి చేయబోతోంది. అంటే.. నవంబర్ నుంచి జనవరి వరకు వరుసగా తన సినిమాలతో అంజలి పలకరించనుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com